Saturday, May 18, 2024
- Advertisement -

రజనీ ‘కాలా’ ట్విట్టర్ రివ్యూ

- Advertisement -

సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలూ.. ఫ్యాన్స్‌కు పండ‌గే.అడ్వాన్స్ బుకింగ్ ఎగబడటం, రిలీజ్ రోజున తలైవాపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు హంగామా చేస్తుంటారు. రజినీకాంత్, పా. రంజిత్ కాంబోలో తెరకెక్కిన ‘కాలా’ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై రజినీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ చిత్రానికి మరింత హైప్ వచ్చింది.రజినీ పొలిటికల్ ఎంట్రీ తరువాత వచ్చి ‘కాలా’ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అసలు కాలా మూవీపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో చూద్దాం.

ప్రిమియర్ షో లు ద్వారా వస్తున్న టాక్ ప్రకారం చాలా వరకూ పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌గా ఉండి కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చారని.. రజినీకాంత్ ఇంట్రో సీన్, రెయిన్ ఫైట్ సీన్స్ అదిరిపోయాయి అంటున్నారు. ఇక సెకండాఫ్ మొత్తం హక్కుల పోరాటం దశగా సాగిందంటున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ మాస్ లుక్‌లో అదరగొట్టేశారంటున్నారు. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని.. ముఖ్యంగా రజినీ పోలీస్ స్టేషన్ సీన్‌లో థియేటర్ దద్దరిల్లిందంటున్నారు. ఓవరాల్‌గా ఓవర్సీస్ నుండి పాజిటివ్ రాబట్టిందని సినీ విశ్లేషకులు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -