Sunday, April 28, 2024
- Advertisement -

షాకింగ్…. 2019లో అక్కడ వైకాపా అభ్యర్థి గెలుపుకు అఖిల సాయం

- Advertisement -

కర్నూలు జిల్లాలోని ఒక ప్రముఖ నియోజకవర్గం…….2014 ఎన్నికల్లో చాలా చిన్న తేడాతో అక్కడ వైకాపా ఓడిపోయింది. అక్కడి నుంచి గెలిచిన టిడిపి ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది……. వైకాపా అభ్యర్థి తన పట్టును ఇంకా పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో టిడిపి మంత్రి అఖిలప్రియ 2019 ఎన్నికల్లో అక్కడ వైకాపా అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా అయినా సరే సాయం చేస్తున్నారన్న వార్తలు బాబు క్యాంప్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం నుంచి 2014లో విజియం సాధించిన టిడిపి అభ్యర్థి బీసీ జనార్థనరెడ్డి ఇప్పుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో జరిగిన మహానాడు, విజయవాడలో జరిగిన మహానాడుతో పాటు చంద్రబాబు సభలకు, మీటింగులకు రావడం మానేశాడు. అందుకు కారణం ఏంటా అన్న విషయం తాజాగా తెలిసొచ్చింది. బనగానపల్లి వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఇఫ్పుడు అక్కడ బలంగా ఉన్నాడు. వైకాపా కూడా బలపడింది. బాబు హామీలతోపాటు, హోదాతో సహా ఏ ఒక్క ప్రయోజనాన్ని రాష్ట్రానికి తీసుకురాలేకపోయిన టిడిపిపై అన్ని నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి ఉన్నట్టుగానే బనగానపల్లిలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీసీ జనార్థనరెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. దానికి తోడు కాటసాని రామిరెడ్డి స్వయంగా భూమా బ్రహ్మానందరెడ్డికి మామ. అందుకే భూమా అఖిలప్రియతో పాటు భూమా ఫ్యామిలీ మొత్తం పార్టీ విభేదాల కంటే బంధుత్వమే ముఖ్యమని చెప్పి అక్కడ వైకాపా గెలుపుకు సాయం చేస్తున్నారట. బనగానపల్లిలో కాంట్రాక్టులను కూడా కాటసాని రామిరెడ్డికి అప్పగించిందట అఖిలప్రియ. ఆ విషయాలు తెలుసుకున్న బీసీ జనార్థనరెడ్డి షాకయ్యాడట. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో 2019 ఎన్నికల్లో బనగానపల్లిలో టిడిపి గెలిచే అవకాశమే లేదని …….తనకు వేరే నియోజకవర్గంలో సీటు ఇవ్వాలని లేకపోతే వైకాపాలో చేరిపోతానని చెప్పేశాడట.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో మంత్రి అఖిలప్రియ వైకాపా అభ్యర్థి గెలుపుకు సాయపడడం మాత్రం బాబు బ్యాచ్‌కి నిద్రలేకుండా చేస్తోందట. అసలు అఖిల ప్రియ ఉద్ధేశ్యం ఏంటో తెలియక టిడిపి నేతలు తలలు పట్టుకుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -