ఈ మధ్య సినిమాలు తీయడం కంటే తీసిన సినిమాలనే లీక్ కాకుండ కాపాడుకోవడం కష్టంగా మారింది.ఎన్ని చర్యలు తీసుకున్న సినిమా షూటింగ్ సమయంలోని కొన్ని సీన్స్ లీక్ అవుతున్నాయి.ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత,విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాలోని కొన్ని సీన్స్ విడుదలకు ముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.తాజగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పెట్ట(వర్కింగ్ టైటిల్) సినిమాలోని సీన్స్ లీక్ అయినట్లు తెలుస్తుంది.
లక్నోలో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి రెండు సీన్స్ కూడా లీకైనట్టుగా చిత్రయూనిట్ గుర్తించారు. దీంతో షూటింగ్ లోకేషన్‌లో సెక్యూరిటీని మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. దాదాపు 500 మంది నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఇప్పటికే విడుదల అయిన మోషన్ పోస్టర్‌కు సూపర్ రెస్పన్స్ వచ్చింది.
