తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా సెట్‌పై విద్యార్ధులు రాళ్లు రువ్వడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… రజినీకాంత్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం కాలేజీ నుంచి స్టూడెంట్స్‌ని రప్పించారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. షూటింగ్ వచ్చిన విద్యార్థులు కుదురుగా ఉంటారా? తమ సెల్‌ఫోన్స్ సినిమా షూటింగ్‌ను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న మురుగదాస్ దీనిపై కాస్తా సీరియస్ అయ్యారంటా.
దీంతో సినిమా యూనిట్ స్టూడెంట్స్‌తో కాస్తా కటువుగా ప్రవర్తించారట. దీంతో మా కాలేజీకి వచ్చి మమ్మల్నే బెదిరిస్తారా అంటూ ఆగ్రహం చెందిన విద్యార్థులు సెట్ పైకి రాళ్ళ వర్షం కురిపించారట. ఒకరో ఇద్దరినో అంటే కంట్రోల్ చేయొచ్చు కాని మరీ ఇలా వందల సంఖ్యలో ఉండే స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడం అయ్యేపని కాదు. స్టూడెంట్స్‌తో సినిమా షూటింగ్ కొనసాగించడం కష్టం అని భావించి వేరే మార్గాలను వెతుకుతున్నారట.
- Advertisement -
రజినీకాంత్ సినిమా సెట్‌పై రాళ్లు విసిరిన విద్యార్ధులు..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -