Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం తొలిసారి విప్పుతున్న రకుల్ ప్రీత్ సింగ్…!

- Advertisement -

తెలుగులో ఇప్పుడు యమ బిజీగా ఉన్న భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి ఈ హీరోయిన్ రాత మారిపోయింది. అవకాశాల మీద అవకాశాలు దక్కాయి. అయితే సరైన హిట్స్ మాత్రం లేవు. కానీ… ఇప్పుడు చేతి నిండా సినిమాలున్నాయి.

ఈ మధ్యనే వచ్చిన “బ్రూస్ లీ’ డిజాస్టర్ గా నిలిచినా ఈ భామకు అవకాశాలు అయితే తగ్గలేదు. అదృష్టం అలా ఉంది. ప్రస్తుతానికి ఈ భామ చేతిలో ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి హీరోల సినిమాలున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో తన కెరీర్ ను చక్కదిద్దుకునే యత్నాలు మొదలుపెట్టింది రకుల్. ఆ సినిమాలు హిట్ అయితేనే.. ఆమె కెరీర్ దిగ్విజయంగా నడిచే అవకాశం ఉంది. లేకపోతే అంతే సంగతులు.

ఇలాంటి నేపథ్యంలో తనకు తానుగా కొన్ని ప్రయత్నాలు చేస్తోంది రకుల్. తెలుగువారికి దగ్గర కావడంలో భాగంగా ఈ భామ ఇప్పుడు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనుందట ఈ పంజాబీ భామ.

మరి చాలా మంది హీరోయిన్లు దశాబ్దాలకు దశాబ్దాలు నటిస్తున్నా.. తమే డబ్బింగ్ చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే రకుల్ మాత్రం త్వరగానే అలర్ట్ అయినట్టుంది. సొంత వాయిస్ తో ఆకట్టుకునే యత్నం చేస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -