Thursday, March 28, 2024
- Advertisement -

టాలీవుడ్‌కు ర‌కుల్ టాటా చెప్పిన‌ట్టే

- Advertisement -

బాలీవుడ్‌లో అక్ష‌య్‌కు జ‌త‌గా ర‌కుల్‌

ర‌కుల్‌ప్రీత్‌సింగ్ పేరు ఓ కొన్నేళ్లు మార్మోగింది. అన్నీ సినిమాల్లో ఆ అమ్మ‌డే క‌నిపించింది. సినిమా థియేట‌ర్ల‌లో ర‌కుల్‌ప్రీత్ జోడితో హీరోలు మంచి విజ‌యాలు అందుకున్నారు. ప‌రాజ‌యాల హీరోలు కూడా మంచి విజ‌యాలు అందుకున్నారు. సందీప్ కిష‌న్‌, మంచు మ‌నోజ్ తదిత‌రులు హిట్లు అందుకున్నారు. ధృవ‌, స్పైడ‌ర్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న ర‌కుల్ మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా ఆమె చేతిలో ఏమీ లేవు. దీంతో తెలుగు సినిమాల‌కు ర‌కుల్ టాటా చెప్పిన‌ట్టే.

ప్ర‌స్తుతం తమిళ్‌లో సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో ర‌కుల్ సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక బాలీవుడ్‌లో హిందీలో సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా న‌టిస్తున్న ఓ సినిమాలో న‌టించింది. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఆ సినిమా విడుద‌ల కానేలేదు ఇప్పుడు అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి న‌టించేందుకు రెడీ అయ్యిందంట‌. కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతోంది.

అక్ష‌య్‌కుమార్ ద‌క్షిణాది హీరోయిన్ల‌కు మంచి అవ‌కాశాలు ఇస్తాడు. అత‌డి పుణ్య‌నే కాజల్, ఆసిన్, శృతిహాసన్, తమన్నాల‌కు బాలీవుడ్ ఎంట్రీ ల‌భించింది. ఇప్పుడు రకుల్‌కు కూడా అక్ష‌య్ ఆ అవ‌కాశం ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం సూర్యతో న‌టిస్తున్న ర‌కుల్ మ‌రోసారీ కార్తీ నినిమాలో నటిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -