Monday, April 29, 2024
- Advertisement -

నిజంగానే ఈవిఎంలు టాంపరింగ్ చేశారా..

- Advertisement -

ఈవియంల టాంపరింగ్ .గత పదేళ్లనుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది. మనం వింటూనేఉన్నాం. అసలు ఈవిఎంలు ఎలా టాంపరింగ్ అవుతాయో కొందరు మేథవులు మీడియా కార్యలయాలకు వచ్చి మరీ ఏదో చూపించారు. అందుల్లో విశ్వసనీతయపై నమ్మకం రాక వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అయినప్పటికీ టాంపరింగ్ అనే మాట తరచూ వినిపిస్తూనే ఉంది. ఓడిపోయిన ప్రతి పార్టీ ఇదే మాట చెప్పుకొచ్చింది. ఎక్కడైనా పార్టీ వన్ సైడ్ కొట్టేస్తే మనకూ ఈ మాటలు చెప్పేవారికి బలం చేకూరుతూ ఉంటుంది. చివరకు విద్యావంతులు సైతం ఈవిఎంలు నిజంగానే టాంపరింగ్ అయ్యాయా అంటూ కొశ్చన్ లు వేస్తుంటారు. 2004, 2009లో వైయస్ గెలిచిన సందర్భంలో పచ్చమీడియా ఈవిషయానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది. ఎల్లో ఛానల్లు కూడా వీటిని గట్టిగానే స్ప్రెడ్ చేశాయి. కాని అదేంటో చివరకు వచ్చేసరికి కూల్ అయిపోయాయి.

తాజాగా గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ లో బిజేపి గెలిచేసరికి హార్దిక్ పటేల్ కూడా ఇదే మాట మాట్లాడటం మొదలు పెట్టాడు. అహ్మద్‌బాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూరత్‌, రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌ ప్రాంతాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ఆరోపించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు పాల్పడి ఎన్నికల్లో గెలుపొందిన భాజపాకు శుభాకాంక్షలని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అతిపెద్ద సమస్యని.. దానిపై విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని హార్దిక్‌ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు వాడటం లేదని.. మనదేశంలో అవి అవసరమా? అని ప్రశ్నించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కానని.. ఉద్యమాన్ని ఇకపైనా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఇదంత భాగానే ఉంది కాని… హార్దిక్ పటేల్ గారి బాధంతా కాంగ్రెస్ జోష్ మీదుండి సీట్లు కొట్టిన ప్రాంతంలో కాకుండా బిజేపికి యాంటీగా ఉండే ముస్లీమ్ ఏరియాస్ లో కూడా బిజేపి ఘంట మోగించడం వారికి సుతారమూ నచ్చలేదు. పైగా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశ అక్కడేమైనా టాంపరింగ్ చేశారేమో అందుకే అలా విజయాన్ని దక్కించుకున్నారేమో అనేది చివరకు ఎల్లో మీడియా బాధకూడా. ఇక్కడ ఎల్లో మీడియా బాధ ఏంటంటే…గుజరాత్ లో మోడికి డ్యామేజ్ జరిగితే… గురుడు మన కంట్రోల్ లోకి వచ్చేస్తాడని చాలామంది భావించారు. కాని అది జరుగలేదు.అందుకే ఈ ఏడుపంత. ఇక్కడ ఈవిఎంలు టాంపరింగ్ చేసే సీనే ఉంటే… పటేళ్లు ఖాన్ దాన్ లో అది సాధ్యమయ్యే పని కాదులెండి.పైగా వాళ్లంతా కాంగ్రెస్ పక్షాన నిలిచన చోట ఇది జరిగే పనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -