Wednesday, May 8, 2024
- Advertisement -

ర‌కుల్ ర‌చ్చ చూడ‌లేక‌పోతున్నాముగా..!

- Advertisement -

ర‌కుల్ ప్రీత్ సింగ్…. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు భాష‌లో స్టార్ హీరోల‌తో సినిమాల‌ను న‌టించి క్రేజీ హీరోయిన్ ఎదిగింది. అయితే గ‌త కొంత‌కాలంగా ర‌కుల్‌కు హిట్ లేదు దీంతో అవ‌కాశాలు ద‌గ్గాయి. ఆమె త‌మిళంలో న‌టించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ కావ‌డంతో అక్క‌డ కూడా డోర్లు మూసుకుపోయాయి. తెలుగులో కొన్ని సినిమాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోతున్నాయి. మ‌హేశ్ బాబుతో స్పైడ‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన త‌రువాత మ‌ళ్లీ తెలుగులో మ‌ళ్లీ హీరోయిన్‌గా న‌టించ‌లేదు.చేతిలో సినిమాలు లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

జిమ్‌లో తెగ క‌ష్ట‌ప‌డుతున్న వీడియోల‌ను త‌న ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ తన కాళ్లను స్ట్రెచ్ చేసింది. కానీ పూర్తిగా చేయలేకపోయింది. ఈ విషయాన్ని చెప్తూ ఈ ఫొటోని షేర్ చేసింది రకుల్. ఇప్పుడీ ఫొటో ఫ్యాన్స్ తెగ నచ్చేస్తోంది. ఆమెలో డెడికేషన్ కు ఇది నిదర్శనం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే కింగ్ నాగ‌ర్జున స‌ర‌స‌న మ‌న్మ‌థుడు 2లో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవ‌లే ఈ సినిమా ప్రారంభం కూడా అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -