Monday, May 6, 2024
- Advertisement -

ఐటం సాంగ్‌తో రచ్చ చేయనున్న ర‌కుల్‌

- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాతో బిజిగా ఉన్నాడు. బోయ‌పాటి సినిమాలు అంటే హైఓల్టేజ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలకు మారుపేరు. బోయ‌పాటి సినిమాలు మాస్‌తో పాటు ఐటెం సాంగ్స్‌కు కూడా మంచి పేరుంది. ‘తులసి’లో ‘నే చుకు చుకు బండిని రో…’, ‘సరైనోడు’లో ‘బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే..’ అందుకు ఉదాహరణలు. అయితే రామ్ చ‌ర‌ణ్ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశాడు బోయ‌పాటి.

ఈ సాంగ్‌కు ర‌కుల్ అయితే బాగుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సాంగ్‌ గురించి ర‌కుల్‌ను సంప్రందిస్తే ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తుంది. దీంతో రామ్‌ చరణ్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఊర మాస్‌ స్టెప్పులు ఖాయంగా క‌నిపిస్తుంది. గ‌తంలో వీరిద్ద‌రు రెండు సినిమాల‌లో క‌లిసి న‌టించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాను సంక్రాతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర నిర్మాత ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -