Monday, May 6, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోకపోతే.. ఆ అనుభ‌వం పొందకూడదా?

- Advertisement -

హీరోయిన్ లక్ష్మీమీనన్ 15 ఏళ్ల వయసులోనే నటిగా పరిచయమైన ఈ కేరళా కుట్టి కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను ఆకట్టుకుంది. త‌రువాత వ‌ర‌స‌గా స్టార్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింది. ఇలా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న‌ప్పుడే నటనకు గ్యాప్‌ తీసుకుని చదువు కోసం విదేశాలకు వెళ్లింది. చ‌దువు పూర్తి అయిన త‌రువాత రీఎంట్రీ అయినా మునుపటి లక్కు రాలేదు. ప్రస్తుతం ప్రభుదేవాతో జంటగా నటిస్తున్న యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది.

అయితే గ‌త కొన్ని రోజులుగా లక్ష్మీమీనన్ పెళ్లిపై ర‌కర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. పెళ్లి వార్త‌లపై లక్ష్మీమీనన్ తాజాగా స్పందించింది. నాకు వివాహబంధంపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి. దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పనంటుంది. మ‌రి లక్ష్మీమీనన్ కోరిక‌ను ఏమాంటారో ఆమె చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -