Tuesday, May 7, 2024
- Advertisement -

అచ్చం శ్రీదేవిలా మారిన ర‌కుల్

- Advertisement -

నందమూరి తారకరామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసిందే.ఈ సినిమాను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ న‌టించ‌డంతో పాటు నిర్మిస్తున్నారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వ వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అతను కథగా మారితే ‘కథానాయకుడు’, అతను ఓ చరిత్ర అయితే ‘మహానాయకుడు’ అంటూ ఇటీవల సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. తొలిభాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల చేయనున్నారు.

ఇప్ప‌టికే సినిమాలో కొంద‌రు స్థార్స్ న‌టిస్తున్నారు.రానా,సుమంత్‌,విద్యాబాల‌న్‌,త‌మ‌న్నా ఇలా స్టార్స్ న‌టిస్తున్నారు.తాజాగా శ్రీదేవి రోల్ కోసం హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేశారు.ఈరోజు చిత్రబృందం ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ లుక్ ని విడుదల చేసింది. ఆకుచాటు పిందె తడిచే సాంగ్ లో శ్రీదేవి కట్టు, బొట్టు ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేరు. ఆ పోస్టర్‌లో ర‌కుల్ అచ్చం శ్రీదేవి చీర క‌ట్టుతో క‌నిపించి మెప్పించింది.పోస్ట‌ర్ అయితే అదిరింది ,శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ఏ మేర‌కు రాణిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -