Friday, May 3, 2024
- Advertisement -

ముందుగా నే ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్న రకుల్

- Advertisement -

అక్కినేని నాగార్జున హీరో గా త్వరలో విడుదల కానున్న సినిమా మన్మధుడు 2. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అనేది అప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఈ సినిమా ఆడాలి అని ఎంత మంది ఆశిస్తున్నారో అంతే రేంజ్ లో ఈ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకొనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే నిజానికి ఎవరికీ నాగార్జున మీద కోపం లేదు. కాకపోతే ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మరియు ఆయన భార్య చిన్మయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అంతా అనుకుంటున్నారు.

అయితే బయట అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉండే చిన్మయి మరి ఇలాంటి సినిమా ని భర్త తో ఎలా తీయించింది అనేది అందరి ప్రశ్న. అయితే ఈ ఎఫెక్ట్ అంతా రకుల్ ప్రీత్ మీద పడుతుంది. ఇప్పటికే అది ఎలా ఉంటుందో రుచి చూసిన రకుల్ ప్రీత్ తాజాగా విమర్శల నుండి తనని తాను కాపాడుకోవడం కోసం ముందుగా నే ఈ సినిమా లో తనది మంచి పాత్ర అని, ఎక్స్పోజింగ్ కి అసలు తావు లేదని జనాలని ప్రిపేర్ చేస్తూ వస్తుంది.

రకుల్ ఎంత చెప్పినా కుదరదు కానీ మొదటి రోజు మొదటి ఆట పడే వరకు అందరూ వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -