Friday, May 3, 2024
- Advertisement -

అరవయ్యేళ్ళ వయసు లో హాఫ్ సెంచరీ టార్గెట్ చేస్తున్న నాగార్జున

- Advertisement -

కింగ్ నాగార్జున హీరో గా త్వరలో విడుదల కానున్న సినిమా మన్మధుడు 2. మన్మధుడు అనే పేరు తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది కానీ మొదటి భాగానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండబోదు అని నాగార్జున ఇప్పటికే స్పష్టం చేసాడు. ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా కి రీమేక్ అని, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం నచ్చి రాహుల్ కి ఈ సినిమా అవకాశం ఇచ్చానని నాగార్జున చెప్పాడు. అయితే ఈ సినిమా మీద నాగార్జున చాలా ఆశలే పెట్టుకున్నాడు. 60 ఏళ్ళ వయసు లో ఒక ప్రేమ కథ,అది కూడా యువకుల తరహాలో చేస్తున్నందుకు నాగార్జున ఈ సినిమా కచ్చితంగా ఆడుతుంది అని నమ్మకం తో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ కూడా నాగార్జున లో ఆశలని అమాంతం పెంచేస్తుంది.

అయితే నాగార్జున ఈ సినిమా తో యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని టార్గెట్ చేస్తున్నాడు. అమెరికా లో కూడా ఈ సినిమా బాగా ఆడేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడున్న మార్కెట్ కి, అభిమానుల అభిరుచులకు, నిజం గా సినిమా మీద ఉన్న టాక్ కి అయితే యాభై కోట్లు రావడం కష్టమే. కానీ ఏం జరుగుతూనే తెలియాలంటే తొమ్మిదవ తేదీ వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -