Thursday, May 2, 2024
- Advertisement -

యోగాతో పాఠాలు బోదిస్తున్న రకుల్ ప్రీత్..!

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు వాళ్లు మెయిన్‍టైన్ చేయాలి. ఇందులో ముఖ్యమైనది వర్కౌట్ లు. ప్రధానంగా హీరోయిన్స్.. తమ గ్లామర్ ను కాపాడుకోవాలి. అలాగే ఫిట్నెస్ కూడా. అందుకే ఉదయాన్నే లేచి యోగాసనాలు వర్కౌట్ లు చేసి ఎటువంటి ఫాట్ చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

అందాలు వడ్డించాల్సిన బాధ్యత కూడా వారి పై ఉంది కాబట్టి.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడాలి అనుకుంటారు కాబట్టి… యోగాసనాలు చెయ్యడం తప్పని సరి. ఈ విషయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ ముందు ఉంది. హాట్ హాట్ ఫోజ్ లతో యోగాసనాలు వెయ్యడమే కాకుండా… వాటితో పాఠాలు కూడా చెబుతుంది. అసలు విషయం ఏమిటంటే … త్రో బ్యాక్ అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది రకుల్. ఈ ఫోటోలో… తలక్రిందులుగా ఉంటూ.. ‘లైఫ్ అంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవడమే.. !

ప్రపంచం తలక్రిందులుగా లేదు… నేను మాత్రమే అలా ఉన్నాను. లేచి నిలబడి సరిచేసుకోగలను. రెండేళ్ళ క్రితం ఫోటో ఇది. సినిమాల్లోకి రావడానికి ముందు నుండీ నేను ప్రతీ రోజూ … యోగా చేస్తూనే ఉంటాను. ఒక్క రోజు కూడా లైట్ తీసుకోవాలి అని మనం అనుకోకూడదు. ప్రతీరోజూ మనం భోజనానికి టైం కేటాయిస్తున్నాం కాబట్టి… వ్యాయామానికి కూడా టైం కేటాయించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇప్పుడు చాలా మంది వారి ఆరోగ్యం కోసం ఒక గంట కూడా వ్యాయామం చెయ్యలేకపోతున్నారు. ఇలా ఐతే ఎలా అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -