Friday, March 29, 2024
- Advertisement -

ఈ నటి ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా ?

- Advertisement -

సితార.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. దాదాపుగా అన్ని భాషల్లో నటించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి వివరణ ఇచ్చారు. కేరళకు చెందిన సితార తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. 1986లో తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. సితార ఎలాంటి పాత్ర చేసినా అందులో మంచి ఎమోషన్ దాగి ఉంటుంది. అందుకే ఆమెకు మంచి పాత్రలు ఇస్తారు మన దర్శకులు.

భలే భలే మొగాడివోయ్ సినిమాలో నానికి తల్లిగా కనిపించి మంచి కామెడీ కోణాన్ని కూడా చూపించారు. అప్పట్లో మెగాస్టార్ స్నేహం కోసం సినిమాలో ఆమె చేసిన రోల్ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అయితే సితార పెళ్లి చేసుకోలేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో సితార తనకు పెళ్లి కాలేదని చెప్పగానే అందరు షాక్ అయ్యారు.

46 ఏళ్ల వయసు ఉన్నా కూడా తన అందంతో ఆకర్షించే సితార పెళ్లి చేసుకోలేదంటే నమ్మలేకపోతున్నాం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె మాట్లాడుతూ.. మా ఫాథర్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాల్లో సపోర్ట్ ఇచ్చేవారు. నేను ఏం చేసిన ఆయన సలహాతోనే చేసేదాన్ని. అలాంటి వ్యక్తి సడన్ గా మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. ఆ తర్వాత పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించలేదు అని సితార చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -