Thursday, May 16, 2024
- Advertisement -

సుక్కూ, చరణ్ కష్టాన్ని నిలబెట్టాల్సింది అదే…. అందుకే ఆ పబ్లిసిటీ

- Advertisement -

రంగస్థలం సినిమా జయాపజయాలు ఏ విషయంపై ఆధారపడి ఉన్నాయి? ఇప్పుడు ఈ చర్చే సినిమా ఇండస్ట్రీలో, ఫిల్మ్ మీడియా సర్కిల్‌లో నడుస్తోంది. సుకుమార్ బ్రిలియంట్ డైరెక్షన్ నిలబెడుతుందా? రామ చరణ్ యాక్టింగ్ నిలబెడుతుందా? దేవిశ్రీ ప్రసాద్ నిలబడెతాడా? ఇవేవీ కావు. ఇక సమంతాతో సహా ఇతరులందరూ కూడా సినిమా హిట్ అయితే ఇంకాస్త హెల్ప్ అవుతారు కానీ సినిమాను నిలబట్టెంత స్కోప్ వాళ్ళకు లేదు.

రంగస్థలం హిట్ ఆర్ ఫ్లాప్ ఆర్ బ్లాక్ బస్టర్…….. బాక్స్ ఆఫీస్ దగ్గర రంగస్థలం ఫలితాన్ని డిసైడ్ చేసేది చిట్టిబాబే. చిట్టిబాబు క్యారెక్టర్‌ని జనాలు ఏ స్థాయిలో ఓన్ చేసుకుంటారు అన్న విషయమే రిజల్ట్‌ని డిసైడ్ చేస్తుంది. చిట్టిబాబు ఎమోషన్స్‌కి ఆడియెన్స్ ఎంతలా కనెక్ట్ అయితే సినిమా ఆ రేంజ్‌కి రీచ్ అవుతుంది. గజిని సినిమాలో సూర్యకు కనెక్ట్ అయినట్టు, శివపుత్రుడులో విక్రమ్‌కి కనెక్ట్ అయినట్టు రంగస్థలంలో చిట్టిబాబుగా కనిపించనున్న రామ్ చరణ్ ఎమోషన్స్‌కి ఆడియెన్స్ ఆ స్థాయిలో కనెక్ట్ అవ్వాలి. ఈ ఒక్క విషయంలో సుకుమార్, చరణ్‌లు సక్సెస్ అయితే మాత్రం రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. ఈ విషయంలో తేడా వస్తే మాత్రం ఇక మిగతావేవీ కూడా రంగస్థలాన్ని నిలబెట్టలేవు. అందుకే సినిమా యూనిట్ మొత్తం కూడా చిట్టిబాబు క్యారెక్టర్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. రాజమౌళితో సహా చాలా మంది టాప్ రేంజ్ సెలబ్రిటీస్‌తో చిట్టిబాబు క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్‌లో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పిస్తోంది. చిట్టిబాబు క్యారెక్టర్‌ని చాలా ఇష్టపడుతున్నామని పబ్లిసిటీ చేయిస్తున్నారు. ఈ పబ్లిసిటీతో పాటు స్క్రీన్ పైన కూడా చిట్టిబాబు పాత్ర ప్రేక్షకులను ఎమోట్ చేయగలిగితే మాత్రం రామ్ చరణ్‌కి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంతృప్తితో పాటు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనందం కూడా మిగులుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -