రామ్‌చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో చరణ్‌కు నలుగురు వదినలు ఉంటారట. స్నేహా, అనన్య (‘జర్నీ’ ఫేం)తో పాటు మరో ఇద్దరు వదినలుగా నటిస్తారట. మిగతా ఇద్దరు కొత్త నటీమణులు హిమజ, ప్రవీణ ఉన్నారని సమాచారం. ఈ నలుగురు పాత్రలు చరణ్‌కు వదినల పాత్రలో కనిపించనున్నారనే సమాచారం ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కైరా అడ్వాణీ నటిస్తుండగా తమిళ నటుడు ప్రశాంత్, హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో ఈ సినిమాలో ఉండనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా పండుగకు ఈ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు.