Friday, March 29, 2024
- Advertisement -

చిరును కాద‌ని ప‌వ‌న్‌కే మెగా ఫ్యామిలీ జై

- Advertisement -

మెగా కుటుంబమంతా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి కుటుంబం చాలా పెద్ద‌ది. సినిమాల ప‌రంగా ఒక్క‌టే కానీ రాజ‌కీయాల ప‌రంగా ఇప్పుడు ఈ కుటుంబంలో చీలిక వ‌చ్చే అవ‌కాశం ఉంది. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి యూపీఏ ప్ర‌భుత్వంలో చిరు భాగ‌స్వామి అయ్యారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. అయితే చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం బీజేపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ టీడీపీ, టీఆర్ఎస్‌తో దోస్తీ కొన‌సాగిస్తున్నాడు. వీరిద్ద‌రివి వేర్వేరు ఆలోచ‌న‌లు. అయితే ప‌వ‌న్ తెలంగాణ‌లో మొద‌లుపెట్టిన పూర్తి స్థాయి రాజ‌కీయ జీవితానికి మెగా కుటుంబం చిరంజీవిని కాద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

జగిత్యాల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండగట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యం నుంచి ప్రారంభించాడు. ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర‌కు మెగా ఫ్యామిలీ అంతా బాస‌ట‌గా నిలిచింది. మెగా న‌టులంద‌రూ ప‌వ‌న్‌కు మద్దతు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రామ్‌చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్ మ‌ద్ద‌తు ప‌లికారు. చిరంజీవి కుమారుడు రామ్‌చ‌ర‌ణ్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ జై జ‌న‌సేన అని అన్నారు.

https://www.youtube.com/watch?v=ulGYc7iTSME

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -