Sunday, May 19, 2024
- Advertisement -

చెర్రీతో ర‌కుల్ కాదు అనుప‌మ‌నే

- Advertisement -

బోయ‌పాటి సినిమాలో అనుప‌మ‌కు అవ‌కాశం

శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో 2017 విజ‌యం అందుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ప్రేమ‌మ్ సినిమాతో ఆక‌ట్టుకున్న ఈ భామ రామ్‌తో ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీలో న‌టించి హిట్ కొట్టేసుకుంది. ప్ర‌స్తుతం నాని న‌టిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో న‌టిస్తోంది. ఈ స‌మ‌యంలో మ‌రో అవ‌కాశం కొట్టేసింది. మెగా హీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ల‌భించింది.

నిన్న‌నే మెగాస్టార్ చిన్న‌ అల్లుడు క‌ల్యాణ్ కానుగంటి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై రానుంది. జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభమ‌య్యే అవ‌కాశం ఉంది. అది మ‌రువ‌క‌ముందే రామ్‌చ‌ర‌ణ్సి, బోయపాటి శ్రీనివాస్ క‌ల‌యిక‌లో వ‌చ్చే సినిమాలో న‌టిస్తుందట‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌`రంగ‌స్థ‌లం` సినిమాలో తొలుత అనుప‌మ‌కే అవ‌కాశం వ‌చ్చిందట‌. ఆ త‌ర్వాత స‌మంత‌కు ద‌క్కిందావ‌కాశం. చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభమైంది. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ సినిమాకు ర‌కుల్ అనుకున్నారు కానీ ఎందుకో అనుప‌మ‌ను ఫిక్స్ చేశారంట‌.

https://www.youtube.com/watch?v=gxhOHvtVc90

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -