Saturday, May 18, 2024
- Advertisement -

ప్ర‌భాస్ ఎస్సంటే ఇప్పుడే పెళ్లి

- Advertisement -
  • అప్‌డేట్ ఇచ్చిన పెద‌నాన్న కృష్ణంరాజు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో బ్యాచిల‌ర్ లైఫ్‌కు ముగింపు ప‌ల‌కని వాళ్లు చాలా మంది ఉన్నారు. రెబ‌ల్ స్టార్ పెళ్లిపైనే అంద‌రి ధ్యాసంతా. పెళ్లి ఎప్పుడంటే ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. ఈ డార్లింగ్‌కు అయ్యే డార్లింగ్ ఎవ‌రా అని ప్రేక్ష‌కులు, అభిమానులు, ముఖ్యంగా యువ‌తులు ఎదురుచూస్తున్నారు. త‌మ‌కంటే అంద‌గ‌త్తె దొరుక్కుద్దా అని కుల్లుకునే ముఖాలు కూడా ఉన్నాయి.

‘బాహుబ‌లి’ సినిమాల‌తో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమాలు అయిపోవ‌డంతో ఇక ప్ర‌భ పెళ్లిపై ప‌డ్డారు. ఎక్క‌డ క‌నిపించినా పెళ్లెప్పుడూ అని మీడియా, అభిమానులు, ప్ర‌ముఖులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ దెబ్బ‌కు ప్ర‌భ పెళ్లిళ్ల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌ ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ పెళ్లి గురించి పెదనాన్న కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో ఓ విష‌యం చెప్పాడు.

‘ప్రభాస్ తన పెళ్లికి ఎప్పుడు ఓకే చెపితే అప్పుడు సంబంధాలు చూడడం మొదలుపెడతాం’ అని ప్ర‌క‌టించారు. ప్రభాస్ వివాహాన్ని జాతకాలు చూసిన తరువాతే కుదురుస్తామని చెప్పారు కృష్ణంరాజు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లికి ఓకే చెపుతాడని నాతోపాటు కుటుంబసభ్యులు అందరూ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -