మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు తన భార్య ఉపాసర గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు. తన సినిమాల డేట్స్ కాని,అప్‌డెట్ కాని,ఫస్ట్ లుక్ అన్ని తన భార్య ఉపాసనే చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. సినిమా ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా తనే గైడ్ చేసిందట. ఇంకా చెప్పాలంటే తన భార్య ఉపాసన ఓ పీఆర్వోలా పని చేస్తుందని తెలిపాడు చరణ్.
ఇక ఉపాసన విషయానికి వస్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. చరణ్ సినిమా గురించి ఎప్పటికప్పుడు అభిమానులు గురించి తెలియజేస్తుంటోంది ఉపాసన. ఓ పక్క ఆపోలో ఆస్పత్రిని మేనేజ్ చేస్తునే , మరో పక్క చరణ్ సినిమాల డేట్స్ చూసుకుంటుంది ఉపాసన.ఇక వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
