Friday, May 10, 2024
- Advertisement -

చరణ్ సినిమా టైటిల్ అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు!

- Advertisement -

చాన్నాళ్లుగా ఆ సినిమాకు టైటిలే లేకుండా కాలం గడిచిపోయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు ఇన్ని రోజులు అయినా టైటిల్ పెట్టలేకపోయారు. వ్యవహారికంగా ఆర్సీ9 అంటూ బండి లాగించారు.

ఇన్ని రోజులూ ఆ సినిమాకు సంబంధించి ఏం కబురు చెప్పాలన్నా ఆర్సీ 9 అంటూ ట్వీట్ చేయడం జరిగింది. మరి అలాంటి సినిమాకు ఏ టైటిల్ పెడతారా? అనేది ఇన్ని రోజులూ ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. అయితే ఎట్టకేలకూ ఆ సినిమాకు టైటిల్ పెట్టారు.

అదే ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ఉప శీర్షిక. ఇంత వరకూ చరణ్ సినిమాలలో వేటికీ ఇలాంటి టైటిల్ పెట్టలేదు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు బ్రూస్ లీ పేరు ను వాడుకొంటూ ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారు . అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఈ టైటిల్ అభిమానులతో అంతగా కనెక్ట్ కావడం లేదు. తమ హీరో సినిమాకు ఎవరో హీరో పేరు మీద టైటిట్ పెట్టడం ఏమిటి? అనేది కొంతమంది సందేహం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. గ్రామీణ తెలుగు ప్రాంతాల్లో బ్రూస్ లీ గురించి తెలిసిన వారు తక్కువ.

బ్రూస్ లీ తీసింది ఫైటింగ్ సినిమాలే అయినా… అవన్నీ మేధావుల స్థాయివి.మరి అలాంటి హీరో పేరు ను టైటిల్ గా పెట్టేస్తే మాస్ కు ఎక్కడం లేదు. దీని బదులు ‘మై నేమ్ ఈజ్ రాజు’ వంటి టైటిల్ పెట్టి ఉన్నా… బాగుండదనే అభిప్రాయాలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వినిపిస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -