Monday, May 13, 2024
- Advertisement -

సల్మాన్ చేతుల మీదుగా అఖిల్ సినిమా టీజర్ విడుదల!

- Advertisement -

ఇప్పటికే ‘అఖిల్ ‘ తొలి సినిమాపై కావాల్సినంత హైప్ ఏర్పడింది. నాగార్జున తనయుడిగా ‘మనం’ సినిమాతో తెరపై కనిపించిన అఖిల్ నితిన్ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా తో పూర్తి స్థాయి హీరోగా కనిపిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘అఖిల్’ పేరుతో రూపొందించిన ఆ సినిమా ఫస్ట్ లుక్ గురించి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

మరి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… “అఖిల్” సినిమా టీజర్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ విడుదల చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ ప్రకటించాడు. ఈ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు టీజర్ ను ఆవిష్కరించనున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ మేరకు #akhilteaser launch tom by the bhai of bollywood @BeingSalmanKhan at 6.30 pm..cant wait to know ur feed back!! అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. మరి నితిన్ తో పాటు అఖిల్ అభిమానులందరికీ ఎగ్జైట్ మెంట్ ను ఇచ్చే విషయమే ఇది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -