Tuesday, April 30, 2024
- Advertisement -

కండల కాంతారావుగా చరణ్ బాబు

- Advertisement -

రొటీన్ గా చేసినా సినిమాలే చేయడం అంటే… ప్రేక్షకులు నో చెప్పేస్తారని అందరికీ తెలుసు. అందుకే… హీరోలు రొటీన్ మూవీల జోలికి పోరు. ఏం చేసినా థ్రిల్ ఉండాలి. ఇదే నేటి హీరోల కాన్సెప్ట్ . ఇక మనం అలా చేస్తే అభిమానులు అలాంటి చిత్రాలు చూడరు అనుకోవడానికి లేదు. మనం మారితే వారు కూడా మారతారు. రెగ్యులర్ ఆడియెన్స్ ని మనమే మార్చుకోవాలి. కొత్తగా కనిపించి వారిని ఆకర్షించాలి.

ఈ నీతి మాటలు ఇప్పుడు టాలీవుడ్ కుర్ర హీరోలు మంచిగానే ఫాలో అవుతున్నారు. రొటీన్ కి భిన్నంగా వారి అభిమానులకు కొత్త లుక్స్ తో కనిపించి వారి చేత విజిల్స్ వేయిస్తున్నారు. మరీ ముఖ్యంగా యంగ్ మెగా పవర్ స్టార్ చెర్రీ కూడా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ అలరిస్తున్నాడు. ధ్రువ సినిమాల్లో చెర్రీ లుక్స్ సూపర్బ్ అనిపించాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రంగస్థలం 1985 లో కూడా గడ్డంతో కనిపించనున్నాడు. ఈ సినిమా అయిపోగానే చెర్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీకి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఈ మూవీలో చెర్రీ ఓ రేంజ్ లో ఉండబోతున్నాడు.

బోయపాటి సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలిసిందే. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా కోసం చరణ్ కసరత్తులు చేస్తున్నాడు.మజిల్స్ తో మటాష్ చేసేస్తానంటున్నాడు. రంగస్థలం 1985 షూటింగ్ డిసెంబర్ లో ఫినిష్ చేసి ఫుల్ గా వర్కౌట్స్ మొదలు పెట్టే ఆలోచనలు రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -