- Advertisement -

‘ఇది నా బెస్ట్ వర్క్’

- Advertisement -

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లేడీ సూపర్ స్టార్ సమంత (Samantha) చేస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు.. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ లేటెస్ట్ ఫీల్-గుడ్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). ఈ సినిమా ఈనెల 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో సమంత తన మనసులోని మాటలను పంచుకున్నారు.

ఈ సినిమాను మీరు ఎంచుకున్నారా? లేక ఈ కధే మిమ్మల్ని ఎంచుకుందా? అని అడగగా.. సమంత నవ్వుతూ, “ఖచ్చితంగా ఈ కధే నన్ను ఎంచుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం వేచి చూశాను. ఆ రైట్ ఛాయిస్ ఇదే అని నా ఫీలింగ్” అని తెలిపారు. తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. “మనం ఏ సినిమా చేసినా, అది గతంలో చేసిన సినిమాల కంటే అన్ని విధాలా మెరుగ్గా ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూర్చుని కాన్ఫిడెంట్‌గా ‘ఇది నా బెస్ట్ వర్క్’ అని గట్టిగా చెప్పగలిగితేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఆ లెక్కన చూస్తే, ‘మా ఇంటి బంగారం’ ఖచ్చితంగా నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది” అని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని సమంత తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్ల గ్యాప్ తీసుకున్నా, ఒక బంగారం లాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమంత.. ఈసారి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -