Thursday, May 2, 2024
- Advertisement -

ఆ హీరో ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ఫవర్ స్టార్

- Advertisement -

మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ కొందరు అభిమానులు వాదులాడుకుంటారు. కానీ సినీ రంగంలో కథానాయకులు, ఆర్టిస్టులు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు. ఒకరి సినిమాలు మరొకరు ప్రోత్సహిస్తూ వస్తుంటారు. తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కన్నడ స్టార్ హీరో యష్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చి సంచలనం సృష్టించిన మూవీ కేజీఎఫ్. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ఇద్దరూ దేశవ్యాప్తంగా స్టార్స్‌ గా క్రేజ్ సంపాదించుకున్నారు. గోల్డ్ మైనింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

కేజీఎఫ్ 1 సూపర్ హిట్ కావటంతో… కేజీఎఫ్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. కేజీఎఫ్ 2 నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‎కు రెస్పాన్స్ ఏ రేంజ్‏లో వచ్చిందే తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నా.. పలుమార్లు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. యష్‌కు చెర్రీ ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. ఈ ఇరువురు స్నేహం చూసి అభిమానులు ముచ్చటపడుతున్నారు. కేజీఎఫ్ -2 ఏప్రిల్ 14 న కేజీఎఫ్‌-2 వరల్డ్‌వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -