Wednesday, May 8, 2024
- Advertisement -

48వ పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. 1996లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పవన్. పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానాన్ని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ 2014 మార్చ్ లో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘జనసేన’ పార్టీని స్థాపించారు. ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కనిపించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నుంచి రాజకీయ పనుల్లో బిజీ అయిపోయారు. తాజాగా ఇవాళ సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ తన 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఇవాళ వినాయక చవితి కూడా కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ విడుదల చేసిన కామన్ డిపి ని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ తమ డిపిలుగా పెట్టేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులే కాకుండా కొందరు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కు పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెడతారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాటిల్లో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -