Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రయాన్ 2 : ఇస్రో మరో విజయం…ఆర్బిటర్ నుంచీ విడిపోయిన ల్యాండర్

- Advertisement -

చంద్రయాన్ 2 లో కీలక దశను విజయవంతం చేశారు ఇస్రో శాస్త్ర వేత్తలు. విక్రమ్‌ ల్యాండర్ ఆర్బిటర్‌ నుంచి విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నాం 1:15 గంటలకు ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది. చంద్రయాన్‌-2లో భాగంగా జూలై 22న నింగిలోకి దూసుకు వెళ్లిన ల్యాండర్‌ గత నెల 22న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. విడిపడే ప్రక్రియ మిల్లీ సెకన్లలోనే పూర్తయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.సెప్టెంబరు 7న చంద్రయాన్-2ను చంద్రుడిపై ల్యాండ్ చేయనుంది.

సెప్టెంబరు 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్‌ కక్ష్యను తగ్గించనున్నారు. సెప్టెంబరు 3న ఉదయం 8.45 నుంచి 9.45 మధ్య ఒకసారి, సెప్టెంబరు 4న మరోసారి తగ్గిస్తారు. దీంతో అది 35 × 97కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుతుంది. సెప్టెంబరు 7న ల్యాండర్ చంద్రుడి ఉఫరితలం దిగనుంది. ఆ రోజున ల్యాండర్‌లోని ‘పవర్‌ డిసెంట్‌’ దశ ప్రారంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది. అది దిగిన తర్వాత… ల్యాండర్ డోర్ తెరచుకుంటుంది. నాలుగు గంటలు తర్వాత అందులోని రోవర్‌ బయటకు వస్తుంది.ఆ రోవర్… చందమామపై తిరుగుతూ… ఫొటోలు, సమాచారాన్ని ఇస్రోకి పంపుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -