Tuesday, May 14, 2024
- Advertisement -

రాంచరణ్.. ఈ సినిమాతో రికార్డులు తిరగరాస్తాడా..?!

- Advertisement -

దర్శకడు శ్రీనువైట్ల డైరెక్షన్ లో రాంచరణ్ హీరోగా రూపొందుతున్న సినిమాపై అభిమానుల్లో బోలెడు ఆశలున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని వారు ఆశిస్తున్నారు. చరణ్ లాస్ట్ సినిమా ‘గోవిందుడు అందరివాడూలే’ అంతగా హిట్ కాకపోవడంతో..

ఈ సినిమాతో అయినా కరువు తీరుతుందని వారు ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు ఫలిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి.

చరణ్ సినిమాకు మంచి మార్కెట్ కనిపిస్తోంది. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాను భారీ ధరలు వెచ్చించి కొనుక్కోవడానికి అనేక మంది ముందుకొస్తున్నారు. ప్రతి ఏరియా హక్కులూ భారీ స్థాయి ధరకు అమ్ముడవుతుండటం విశేషం. ఈ సినిమా ప్రీ రిలీజ్ దశలోనే.. కొన్ని ఏరియాల్లోనే దాదాపు 20 కోట్ల రూపాయల మార్కెట్ చేయడం విశేషం! ఓవర్సీస్ హక్కులే ఏకంగా ఆరు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

ఇంకా పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడు పోక ముందే.. ఈ సినిమా ఈ స్థాయిలో మార్కెట్ చేసిందని తెలుస్తోతంది. మరి ఈ సినిమా విడుదల అయితే.. ఇది టాలీవుడ్ రికార్డులను తిరగరాసే అవకాశాలు లేకపోలేదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలు లేకపోలేదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -