Monday, May 6, 2024
- Advertisement -

కేసీఆర్ క్లీనింగ్ ప్రోగ్రామ్ వెనుక అసలు లక్ష్యం వేరే ఉందా?!

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అప్పుడెప్పుడో స్వచ్ఛభారత్ అంటూ క్లీనింగ్ ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చాడు. సెలబ్రిటీలను ఈ కార్యక్రమంలోకి లాగాడాయన.

అయితే అప్పట్లో ఈ కార్యక్రమం గురించి అనేక మంది స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని గురించి పట్టనట్టుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణ గవర్నమెంటుకు స్వచ్ఛ కార్యక్రమం గురించి ఆసక్తి పెరిగింది. ఎందుకిలా అంటే.. దీని వెనుక ప్రత్యేక కారణాలే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న ఫలంగా ఈ కార్యక్రమం చేపట్టడం వెనుక.. ప్రత్యేకించి హైదరాబాద్ లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం వెనుక వేరే రీజన్లున్నాయని సమాచారం. తెలంగాణలో ఎక్కడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు కేవలం.. ఇది హైదరాబాద్ కే పరిమితం అయిన ముచ్చట. దీన్ని బట్టి ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్ హైదరాబాద్ నగర ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది!
త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలపై టీఆర్ఎస్ బోలెడు ఆశలను పెట్టుకొంది. ఈ ఆశలను నెరవేర్చుకోవడానికి ఇప్పటికే అన్ని అస్త్రాలనూ సంధిస్తోంది. అయితే ఇవి చాలవని కేసీఆర్ భావిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ లనుంచి నేతలను ఆకర్షిస్తే చాలదు.. ప్రజలను ఆకర్షించాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే ఉన్నఫలంగా ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చాడని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితిని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంత వరకూ రక్షిస్తుందో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -