మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాకు ఘోర అవమానం జరిగింది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. రామ్ చరణ్ అభిమానులు సైతం సినిమాను చూసి తిట్టుకున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. తాజాగా ఈసినిమాకు మరో అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో కూడా ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఆదివారం నాడు యూఎస్‌లోని ఓ థియోటర్‌కు ఒకే ఒక్క ప్రేక్షకుడు రావడం సంచలనం కలిగిచడంతో పాటు, ఆశ్చర్యాన్ని కూడా కలిగిచింది.
థియోటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడు మాత్రమే వచ్చాడట. షో మొత్తం మీద ఒక్క టికెట్ మాత్రమే సేల్ అయిందని థియోటర్ యాజమాన్యం చెప్పడం విశేషం. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు దక్కని రికార్డు రామ్ చరణ్ సినిమాకు మాత్రమే దక్కిందని అంటున్నారు థియోటర్ యాజమాన్యం. ధృవ, రంగస్థలం సినిమాలతో నటుడిగా ఎంతో ఎదిగిన రామ్ చరణ్ వినయ విధేయ రామతో తిరిగి తన యధాస్థానానికి పడిపోయాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. తెలుగుతో పాటు యూఎస్‌లో కూడా ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు