Thursday, May 2, 2024
- Advertisement -

స్కూల్ డేస్ జ్ణాప‌కాల్లోకి వెల్లిన‌ చెర్రీ….

- Advertisement -

స్కూల్ .. కాలేజ్ డేస్ మెమరీస్ ప్ర‌తీ ఒక్క‌రికి ఉంటాయి. వాటిని మ‌ర‌చిపోవ‌డం అసాధ్యం. లైఫ్ లో ఎన్నో సాధించి ఎంతో ఎత్తుకు ఎదిగేసినా ఆరోజులకు ఉన్న గొప్పతనం జ్ఞాపకాల్లో అలానే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే అందరూ చిన్ననాటి స్మృతులను నెమరువేసుకుంటూ ఉంటారు. చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలు, బాల్య స్నేహితులు, పాఠశాలలో గడిపిన రోజులు ఇలా వాటిని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటే కలిగే ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేం.

అలాంటి అనుభూతుల్నే సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చెర్రీ .. తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి చిన్న‌నాటి జ్ణాప‌కాల‌ను మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో భాగంగా గాయపడిన చెర్రీ గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.

చరణ్‌ ఇటీవలె తన స్కూల్‌ డేస్‌ను గుర్తు తెచ్చుకుంటూ.. చెన్నైలో తాను చదువుకున్న లారెన్స్ లవ్ డేల్‌ను సందర్శించారు. అక్కడి వాతావరణాన్ని, ప్రదేశాలను, క్యాంటీన్‌, హాస్టల్‌ రూమ్‌లను తనివి తీరా చూస్తూ ఆనందపడిపోయారు.

చరణ్ లారెన్స్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి ఫోటో దిగడం ఆసక్తికరం. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లారెన్స్ స్కూల్ అనేది లవ్ డేల్ (తమిళనాడు) అనే ఏరియాలో ఎంతో ప్రాచుర్యం ఉన్న స్కూల్. హెన్రీ మోంట్ గోమెరీ లారెన్స్ అనే ఆయన స్థాపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -