Monday, May 20, 2024
- Advertisement -

చిరంజీవి, చెర్రీకి ఏ కాఫీ ఇష్టం

- Advertisement -
  • కాఫీ త‌యారీ విధానం చెప్పిన ఉపాస‌న‌

కొణిదెల కుటుంబానికి వెళ్లిన కామినేని ఆడ‌ప‌డుచు ఉపాస‌న కామినేని ఇటు ఇంటి బాధ్య‌త‌ల‌తో పాటు వ్యాపారాల‌ను స‌క్ర‌మంగా న‌డుచుకుంటూ ఓ ఉత్త‌మ ఇల్లాలుగా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. అప్పుడ‌ప్పుడు చెర్రీతో పాటు సినిమా సెట్స్‌కు వెళ్లి స‌ర‌దాగా ఉంటోంది. ఇటీవ‌ల బతుక‌మ్మ ఉత్స‌వం సంద‌ర్భంగా చిన్నారుల‌తో క‌లిసి ఉపాస‌న‌, రాంచ‌ర‌ణ్ దంప‌తులు సంద‌డి చేశారు. ఇప్పుడు ఆమె త‌న మామ‌గారు చిరంజీవికి, భ‌ర్త‌కు ఏ యే కాఫీలు ఇష్ట‌మో చెప్పింది. వాటిని ఎలా త‌యారు చేస్తారోన‌ని ఓ వీడియో ద్వారా చెప్పింది.

సెల‌బ్రిటీల వంట‌గాడు శ్రీనుతో కాఫీ త‌యారీ విధానం గురించి వివ‌రించారు. అత‌డికి ముప్ప‌యేళ్ల అనుభ‌వం వంట‌లో ఉంద‌ని పేర్కొన్నారు. అత‌డు కాఫీ త‌యారు చేస్తుంటే ఉపాస‌న త‌యారీ విధానాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించారు. త‌న మామ చిరంజీవికి, భ‌ర్త‌కు స్ర్టాంగ్ కాఫీ అంటే చాలా ఇష్ట‌మ‌ని అతడు చెప్పాడు. చివ‌రికి మేడం కూడా చాలా స్ర్టాంగ్ అని ప్ర‌శంసించాడు. కాఫీ గ్లాస్‌లో సీ అని ఉంటే సీ ఫ‌ర్ చ‌ర‌ణ్ అని చెప్పారు. త‌న‌కు చ‌క్కెర ఇష్టం లేద‌ని, బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య సూత్రాలు తెలిపింది. సాయంత్రం 4 గంటల సమయంలో కాఫీ తాగితే చాలా మంచిది అని, నిద్ర కూడా బాగా పడుతుందని వివరించింది. ఇక జిమ్ వర్కౌట్స్ చేసే స‌మ‌యంలో బ్లాక్ కాఫీ తాగితే శ‌క్తి, సామ‌ర్థ్యాలు పెరుగుతాయని సూచనలు కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఉపాస‌న అపోలో ఆస్ప‌త్రుల వ్య‌వ‌హారాలు చూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -