Monday, May 13, 2024
- Advertisement -

నేను వేధింపులు ఎదుర్కొన్నా: రాధికా ఆప్టే

- Advertisement -
  • అవ‌కాశాలు చేజారుతాయ‌ని చెప్ప‌లేదు.

లైంగిక వేధింపులు సామాన్య మ‌హిళ‌ల‌కే కాదు మాపై కూడా జ‌రుగుతాయ‌ని ఇటీవ‌ల సినీ న‌టీమ‌ణులు చెబుతున్నారు. అయితే దీనిపై రాధికా ఆప్టే కూడా స్పందించింది. తాను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన తొలినాళ్ల‌ల్లో కూడా తాను ఎదుర్కొన్న‌ట్లు ఆమె పేర్కొంది. కొత్తలో లైంగిక వేధింపులకు తానూ గురైనట్లుగా ప్రకటించింది. తనలా చాలా మంది నటీమణులు లైంగిక వేధింపులకు గురయ్యారని, కానీ ఆ విషయం బయటకు చెబితే అవకాశాలు చేజారిపోతాయో.. రాకుండా పోతాయోమోన‌నే భయంతో వారు అసలు విషయాలు వెల్లడించడం లేదని తెలిపింది. ఈ విధంగా ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.

‘జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగాలని, పలానా దర్శకుడు.. పలానా నిర్మాత తనను లైంగిక పరమైన సమస్యలకు గురి చేశాడని చెబితే.. వచ్చే అవకాశాలు కాస్త మిస్ అయిపోతాయేమోనని భయంతో వారు పెదవి విప్పడంలేదు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్నిరంగాల్లో ఇలాంటి వేదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వేధింపులు కేవలం ఆడవారే కాదు మగవారు కూడా పలు సందర్భాల్లో ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మాత్రం మౌనంగా ఉండకూడదు. దైర్యంగా వాటిని ఎదురించి అధిగమించాలి’ అంటూ మాట్లాడుకొచ్చింది రాధికా ఆప్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -