Friday, May 3, 2024
- Advertisement -

చరణ్ ఉపాసన ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలుసా?

- Advertisement -

ఉపాసన చరణ్ ప్రస్తుతం ఆఫ్రికా పర్యటన లో బిజీ గా ఉన్నారు. అయితే ఈ పర్యటన లో భాగం గా ఆఫ్రికా లో ని పాపులర్ పార్క్ మరియు అడవి ని సందర్శించారు ఈ మెగా దంపతులు. ఇప్పటికే ఉపాసన దీనికి సంబందించిన ఫోటోలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పెడుతున్నప్పటికీ తాజాగా ఆఫ్రికా ఏం నేర్పించింది అనే విషయం పై ఆవిడ కొన్ని అనుభవాలు తెలిపింది.

ఉపాసన జంతువులని చాలా ప్రేమిస్తుంది. ఆ విషయాన్నీ ప్రస్తావిస్తూ, “ఇప్పుడు మీ అందరికీ చరణ్ నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో తెలిసి ఉంటుంది.” అని చెప్పింది. అంతే కాకుండా “నాకు చరణ్ కి ఈ ఆఫ్రికా దేశం చాలా విషయాలనే నేర్పించింది. మన ప్రకృతి తల్లి ని మనం గౌరవించాలి. అడవులని, జంతువులని చూసి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. జంతువుల యొక్క ఇన్స్టింక్ట్స్ ని మనం గౌరవించాలి. ప్రకృతి ని ప్రేమించాలి. మనం అందరం కలిసి దీనిని అమలు పరుచుకోవాలి. చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద తేడా తీసుకోరాగలవు.” అని ఉపాసన హితవు పలికింది.

ఇదంతా చూస్తుంటే ఉపాసన మరియు చరణ్ తమ ఆఫ్రికా టూర్ కంప్లీట్ చేసుకొని ఇండియా కి పయనమవుతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -