Tuesday, April 30, 2024
- Advertisement -

వైసీపీ కోసం పనిచేసిన వారికి జగన్ అందలం

- Advertisement -

ఏపీ సీఎంగా గద్దెనెక్కగానే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారుల బదిలీలను చేశారు. స్టిక్ట్ ఆఫీసర్లను తన కోటరీలోకి తీసుకున్నారు. పాలనను గాడిన పెట్టేందుకు వరుస సమీక్షలు చేస్తున్నారు. ఒక్కో శాఖను సమీక్షిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖను సమీక్షించి బెల్ట్ షాపులను తీసివేయించాలని అవసరమైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బెల్ట్ షాపులను నిర్వహించేలా ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు.

తాజాగా వైసీపీ అధినేత జగన్ టీడీపీ హయాంలో పదవులను దక్కించుకున్న వారిని సాగనంపేందుకు రెడీ అయ్యారు. కీలకమైన నామినేటెడ్ పదవులను వైసీపీ కోసం సీట్లు త్యాగం చేసిన వారికి.. వైసీపీ కోసం పాటుపడి ప్రచారం చేసి ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీ పాలకమండలి సహా చిన్నా పెద్ద నామినేటెడ్ పోస్టుల పాలకమండల్లను రద్దు చేయడానికి జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం..

ఇక తాజాగా అందుతున్న సమాచారం.. జగన్ కు బాబాయ్ వరుస అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు రెడీ అయినట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది..

మొన్నటి ఎన్నికల వేళ సిట్టింగ్ ఒంగోలు ఎంపీ అయిన వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు లోక్ సభ టికెట్ ను ఇచ్చారు. ఈ విషయంలో వైవీ అలగడం.. జగన్ సర్ధిచెప్పడం జరిగిపోయింది. దీంతో పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్లకు మొదట భారీ నామినెటెడ్ పదవులు ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారు..

వైవీ తర్వాత నటుడు మోహన్ బాబుకు కూడా జగన్ భారీ పదవి ఇవ్వబోతున్నారు. బహుషా ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రధాన కార్యదర్శి, నటుడు ఫృథ్వీకి కూడా జగన్ ఒక నామినేటెడ్ పదవి ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇలా పార్టీ కోసం పనిచేసి విజయం సాధించిన నేతలకు న్యాయం చేసేందుకు జగన్ నడుం బిగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -