Saturday, May 4, 2024
- Advertisement -

ల‌క్ష్మీ పార్వ‌తీగా హాట్ బ్యూటీని ప‌ట్టిన వ‌ర్మ‌..!

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో సంచల‌నానికి తెర‌లేపాడు. దివంగత నందమూరి తారక రామారావు జీవిత క‌థ‌ను ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమా తీయ‌నున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ సినిమా మొత్తం నందమూరి తారక రామారావు రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తీ చూట్టునే తిరుగుతుంద‌ని ముందే చెప్పేశాడు వ‌ర్మ‌.అందుకే సినిమాకి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ పెట్టానని గ‌తంలోనే చెప్పాడు వ‌ర్మ‌.తాజాగా ల‌క్ష్మీ పార్వ‌తీ క్యారెక్ట‌ర్‌లో రూపాలీ సూరి అనే కొత్త అమ్మాయిని తీసుకున్నాడ‌ని తెలుస్తుంది.. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన‌ ఈ భామ కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.

ఆమె నటించిన ‘ఇన్ సైడ్ ఎడ్జ్-2’ అనే వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ లో విడుదల కానుంది.ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో లక్ష్మీపార్వతిగా దర్శకుడు వర్మ ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రూపాలీ సూరి కన్ఫర్మ్ చేస్తూ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను నటిస్తున్నా.. త్వరలోనే వివరాలను ప్రకటిస్తాను. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉన్నాను.అయితే దీనిపై వ‌ర్మ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవడం విశేషం.ఎందుకంటే వ‌ర్మ తన సినిమాల‌కు సంబంధించిన ఏ వార్త అయిన వెంట‌నే త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.ల‌క్ష్మీ పార్వ‌తీ పాత్ర‌లో రూపాలీ సూరి న‌టిస్తుందో లేదో తెలియాలి అంటే వ‌ర్మ చెప్పే వ‌ర‌కు ఆగాల్సిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -