వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తునే ఉంటాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. పాల్ కారులో ప్రయాణిస్తూ బాక్సింగ్ విన్యాసాలు చేస్తూ కనిపించిన సంగతి అందరికి తెలిసిందే. దీనిపై కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. బాక్సింగ్ దిగ్గజాలకు గురువు ఇతనే అంటూ పాల్‌ను తెగ పొగిడాడు.బాక్సర్ మైక్ టైసన్‌ను మట్టికరిపించిన ఈవాండర్ హోలీఫీల్డ్‌కు పాల్ శిక్షణ ఇచ్చాడని నేను ఒప్పేసుకున్నా అని పాల్ వీడియోను పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఫైట్ చేసేందుకు మంచి కసి మీద ఉన్నట్లు హావభావాలతో చెబుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి దుర్భర జీవితాన్ని గడిపారో ఈ సినిమాలో చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -
కేఏ పాల్‌పై ఫన్నీ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -