- Advertisement -

నంది జ్యూరీకి ఆస్కార్ ఇవ్వాలి

- Advertisement -
  • నంది అవార్డుల‌పై వ‌ర్మ పంచ్‌లు

నంది అవార్డులపై విమ‌ర్శ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. వీటికి రామ్‌గోపాల్‌వ‌ర్మ కామెంట్లు చేయ‌డంతో ఈ లొల్లి ర‌చ్చ‌ర‌చ్చ అవుతోంది. సెటైరిక్‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ త‌న‌దైన శైలిలో విమ‌ర్శించాడు. తాజాగా అత‌డి విమ‌ర్శ‌ల‌పై నెటిజ‌న్లు బాగా స్పందిస్తున్నారు. నంది అవార్డుల తాను పంచ్‌లు వేసి ప్ర‌భుత్వానికి, జ్యూరీ స‌భ్యుల‌కు చుర‌క‌లంటించాడు. `అసలింత గొప్ప ఎంపిక ప్రపంచంలోనే ఉండబోదంటూ సెటైరిక్ గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రెండు సందేశాలు త‌న ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశాడు.

కెమరూన్  బోయపాటి శ్రీను కాళ్ళు పట్టుకుంటాడు
లెజెండ్ సినిమాకి ఇచ్చిన అవార్డుల మీద కాంట్రవర్సీ ఏంటో నాకు అర్ధమవ్వట్లేదు.. అది కేవలం జెలసి ఉన్నవాళ్లు కాంట్రవర్సీ చేస్తున్నారు…నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడు.

నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూశా…వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్ర్టార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ .. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్

ఈ విధంగా వ‌ర్మ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై స్పందించాడు. వ‌ర్మ ఏ కామెంట్లు చేసినా ఫ‌న్నీ, సెటైరిక‌ల్‌గా చేస్తుంటాడు. అదే ఆయ‌న‌కు ప్ల‌స్‌, మైన‌స్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -