టాలీవుడ్ వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదలతోనే సావాసం చేస్తుంటాడు. వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమా ఏపీలో విడుదల కాలేదు. కాని తెలంగాణలో విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. వర్మ తన సినిమాతోనే కాకుండా తన వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ పడక గది సంబంధాలు గురించి చెప్పుకొచ్చాడు.
వర్మ మాట్లాడుతు… నా దృష్టిలో పడక గది సంబంధాలకు అంతగా విలువ ఇవ్వను. వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని అనుకుంటునని చెప్పుకొచ్చాడు. రిలేషన్స్ గురించి తాను పట్టించుకోనని , అందుకే తన భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు వర్మ. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ తరువాత వర్మ మరో బయోపిక్‌ను ప్రకటించాడు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ జీవితాన్ని వెండితెర మీద చూపించబోతున్నానని ప్రకటించాడు వర్మ.
- Advertisement -
పడక గది సంబంధాల గురించి చెప్పుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -