Tuesday, May 14, 2024
- Advertisement -

శ్రీరెడ్డి సాధించిన విజయానికి ఆమె తల్లి గర్వపడాలి

- Advertisement -

చిత్ర పరిశ్రమలో ఏదైనా వివాదం తలెత్తిందంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ అక్కడ వాలిపోతారు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ ఆ వివాదానికి మరింత ప్రచారం కల్పిస్తుంటారు. అప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా వివాదంలో ఇదే జరిగింది. ఆ తరవాత కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ యుద్ధంలోనూ వర్మ వేలు పెట్టారు. ఇప్పుడు మరో వివాదంలో ఆయన యాక్టివ్‌ యూజర్ అయిపోయారు.

ప్రస్తుతం శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వివాదం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో పడుకుంటేనే గానీ అవకాశాలు రావని.. ఆ సంస్కృతి పోవాలని నటి శ్రీరెడ్డి పోరాడుతున్నారు. అంతేకాకుండా బడా నిర్మాతలు, సినీ ప్రముఖులతో ఉన్న సంబంధాలను ఆమె బహిర్గతం చేస్తూ వస్తున్నారు. చిన్నగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు చినిగి చినిగి గాలివానలా మారింది.

శ్రీరెడ్డి నేషనల్ సెలబ్రిటీ అయిపోయిందని ఐదు రోజుల క్రితమే ట్వీట్ చేసిన వర్మ.. తాజాగా మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. 100 ఏళ్ల క్రితం సినిమా ఆవిర్భావం జరిగినప్పటి నుంచే కాస్టింగ్ కౌచ్ వచ్చేసిందని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ భూతాలపై ఈ 100 ఏళ్లలే ఎవరూ పోరాటం చేయని విధంగా ఇప్పుడు శ్రీరెడ్డి పోరాటం చేస్తోందని కొనియాడారు. ఈ విషయంలో ఆమెకు సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

శ్రీరెడ్డి బట్టలు విప్పితే చాలా మంది తప్పుబట్టారు. కానీ ఆ చర్య జాతీయ, అంతర్జాతీయ సంఘాలను నిద్రలేపింది. దీన్ని ఎవరూ ఖండించలేరు. శ్రీరెడ్డి సాధించిన విజయానికి ఆమె తల్లి గర్వపడాలి’ అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు.

Casting couch existed ever since the advent of Cinema a 100 years back ..Not getting into individual allegations @MsSriReddy has drawn more attention to the evils of Casting Couch than anyone in the last 100 years and I salute her for that 👍

— Ram Gopal Varma (@RGVzoomin) April 12, 2018

Those who thought @MsSriReddy was wrong in stripping can’t deny,its only that shock which woke up both national and international communities ..Sri Reddy’s mother should be proud of what her daughter achieved for film industry in general and aspiring actresses in particular

— Ram Gopal Varma (@RGVzoomin) April 12, 2018

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -