- Advertisement -

రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్‌ లుక్‌

- Advertisement -

హీరో రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’తో సక్సెస్‌తో కొంత గ్యాప్ తీసుకుని రెండు సినిమాల‌తో బిజి బిజిగా ఉన్నాడు.అందులో ఒక‌టి సినిమా చూపిస్త మామ, నేను లోకల్‌ వంటి హిట్‌ మూవీస్ తీసిన డైరెక్టర్‌ త్రినాథ్‌రావు ద‌ర్శ‌కత్వంలో ఒక‌టి. గ‌రుడ‌వేగ లాంటి హిట్ కొట్టిన ప్ర‌విణ్ స‌త్తారు డైర‌క్ష‌న్‌లో మ‌రో మూవీ చేస్తున్నాడు. మొద‌ట త్రినాథ్‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు.ఈ సినిమా టైటిల్‌ను ‘హలో గురు ప్రేమకోసమే’ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమా టైటిల్ లోగోను రీలిజ్ చేశారు చిత్ర యూనిట్. ‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్‌ లుక్‌ను ఈరో​జు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -