Tuesday, May 14, 2024
- Advertisement -

అజ్ణాతంలోకి వెళ్లిన సోము వీర్రాజు.. పార్టీలో రాజీనామాల క‌ల‌క‌లం

- Advertisement -

భాజాపా అధ్య‌క్షుడిగా క‌న్న ల‌క్ష్మీనారాయ‌ణను అధిష్టానం నియ‌మించ‌డంతో ఆపార్టీలో ముస‌లం మొద‌ల‌య్యింది. మొద‌టినుంచీ అధ్య‌రేసులో ఉన్న సోము వీర్రాజు అజ్ణాతంలోకి వెల్ల‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పార్టీలో ఒక్క‌సారిగా అసంతృప్తి భ‌గ్గుమంది. కన్నాతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్తారని భావించినప్పటికీ.. పార్టీ నేతలకు వీర్రాజు అందుబాటులో లేరని సమాచారం.

క‌న్నాకు అధ్య‌ప‌ద‌వి ఇవ్వ‌డంతో సోము వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. సాయంత్రంలోగా సోమును పార్టీ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య హెచ్చరించారు.

తమ హెచ్చరికను పెడచెవిన పెడితే జిల్లా కార్యవర్గం మొత్తం రాజీనామాలు చేస్తామని అన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడినవారిని విస్మరించి, మొన్న పార్టీలోకి వచ్చి, నిన్న వైసీపీలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నాకు అధ్యక్ష పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం కావడం.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగడం తదితర పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా హరిబాబు వైదొలగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎన్నికల కన్వీనర్‌గా సోము వీర్రాజును బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే.

మొదటినుంచి ఏపీ రాజకీయాల్లో బీజేపీ తరఫున దూకుడుగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజుకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. పార్టీ అధినాయకత్వం కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. అయితే, పార్టీ మారేందుకు సిద్ధపడిన కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించేందుకు ఆయనకు అధ్యక్ష పదవి అప్పగించినట్టు సోము వీర్రాజు వర్గీయులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -