Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రేమకోసమే ఫార్మ‌ల్ డ్రెస్‌లో ‘ఎన‌ర్జిటిక్ స్టార్‌’ లుక్ ఇదే!

- Advertisement -

‘సినిమా చూపిస్త మామ’, ‘నేను లోకల్‌’ సినిమాల‌తో మంచి ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్న త్రినాథ్ రావు నక్కిన త‌న త‌ర్వాతి సినిమాను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో మొద‌లుపెట్టాడు. ఇటీవ‌ల ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిట్ తరువాత రామ్‌ చేస్తున్న ఈ సినిమాకు ‘హలో గురూ ప్రేమకోసమే’ టైటిల్ పెట్టేశారు. ఈ సినిమా కోసం రామ్ ప్ర‌త్యేక లుక్‌లో క‌నిపించనున్నాడు.

ప్రేమ‌క‌థ సినిమా కావ‌డంతో రామ్‌ను ల‌వ్లీ బాయ్‌గా చూపించ‌డానికి ద‌ర్శ‌కుడు శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నాడు. అందులో భాగంగా రామ్ ఇటీవ‌ల ఓ ఫొటోను విడుద‌ల చేశాడు. ఈ సినిమాలోనిదే అని చెబుతూ త‌న సోష‌ల్ అకౌంట్స్‌తో ప్రేక్ష‌కుల కోసం విడుద‌ల చేశారు. ఫార్మల్ డ్రెస్‌లో స్టైలిశ్‌గా రామ్ కనిపిస్తున్నాడు. క‌ళ్ల‌జోడు పెట్టుకొని స్టైల్‌గా నిల‌బ‌డి ఓ లుక్ ఇచ్చుకున్నాడు. ఈ ఫొటోను బ‌ట్టి సినిమా ఎలా ఉండ‌బోతోందో తెలుస్తోంది.

రామ్ ప‌క్క‌న అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా శ్రీవేంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -