Friday, May 17, 2024
- Advertisement -

సినిమా లో బూతుల పై రామ్ వివరణ

- Advertisement -

పూరి జగన్నాథ్ సినిమా అంటే నే చాలా రా గా, మాస్ ఎలెమెంట్స్ తో మంచి మసాలా సినిమా అనుకోవచ్చు. పూరి సినిమాలు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరించేవి కానీ క్రమేపి అది తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకి తెలిసిందే.

అయితే పూరి జగన్నాథ్ కి ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాల్సిన చిత్రం అని చెప్పుకోవచ్చు. రామ్, నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ చూస్తే అందులో బూతులు కనిపిస్తున్నాయి. కచ్చితం గా సినిమా కి A సరిటిఫ్కెట్ వస్తుంది అని చర్చ కూడా నడించింది ఇండస్ట్రీ లో. అయితే నిజానికి రామ్ ఈ విషయం మీద స్పందించాడు.

ఈ సినిమా లో హీరో పాత్ర చాలా నాచురల్ గా ఉంటుంది అని, తను పెరిగిన పరిస్థుతుల వలన నే హీరో బూతులు మాట్లాడతాడు అని, సినిమా చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది అని, అందులో కొత్తగా ఇబ్బంది పెట్టె లాగా ఏమి ఉండదు అని రామ్ చెప్పుకొచ్చాడు.

మరి సినిమా చూసాక ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -