Saturday, May 4, 2024
- Advertisement -

కలెక్షన్స్ వార్: ఇస్మార్ట్ వర్సెస్ కామ్రేడ్

- Advertisement -

భరత్ కమ్మ దర్శకత్వం లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కి పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కి అస్సలు పొంతన ఏమి లేదు. కానీ అనవసరం గా సోషల్ మీడియా లో కొంత మంది ఈ రెండు సినిమాలని కంపేర్ చేస్తూ సినిమాల మధ్య కలెక్షన్స్ పేరిట వివాదం సృష్టిస్తున్నారు. రెండు సినిమాలకి సపరేట్ గా ఆడియన్స్ ఉన్నారు. ఒక సినిమా నచ్చిన వాళ్ళకి ఇంకో సినిమా నచ్చచ్చు లేక నచ్చకపోవచ్చు కూడా. అయితే ఇస్మార్ట్ కన్నా కామ్రేడ్ కొన్ని ఏరియాల్లో బాగా చేస్తుంది అని కొందరు, కామ్రేడ్ విడుదల అయినా కానీ ఇస్మార్ట్ శంకర్ కి అసలు వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు అని కొందరు గొడవ మొదలు పెడుతున్నారు.

తెలంగాణ ప్రాంతం లో, ముఖ్యంగా బోనాలు పండుగ సందర్భం గా ఇస్మార్ట్ శంకర్ సినిమా బాగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే డియర్ కామ్రేడ్ మీద మాత్రం జనాలు అంత ఆసక్తి చూపిస్తున్నట్టు లేదు. ఈ దశ లో అనవసరం గా ఈ కంపేరిజన్స్ తీసుకొని వచ్చి కొంత మంది అభిమానుల మధ్య అనవసరం గా సమయం వృధా చేసుకుంటున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -