భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రపంచకప్ వైఫల్యం తర్వాత కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే విండీస్ టూర్ కు బయలు దేరే ముందు ప్రెస్ మీట్ లో కోచ్ ఎంపికపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఖండించారు.
దరఖాస్తులు ఆహ్వానించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానె మరో సారి కోచ్ రవిశాస్త్రికే తన ఓటు అంటూ కోహ్లీ బహిరంగంగా వ్యాఖ్యలు చేవారు. ఇంకా కోచ్ ఎంపికపై దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇలా మాట్లాడటం తగదని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే పేర్కొన్నాడు. ‘ ఇలా బహిరంగంగా చెప్పడం ఎంతమాత్రం సరైనది కాదని పేర్కొన్నారు.
దరఖాస్తులకు ఆహ్వానించిన దానికి సంబంధించిన ప్రొసెస్ ఇంకా జరుగుతుండగానే కోచ్ ఎంపికలో ముఖ్య పాత్ర పోషించే వ్యక్తులు ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం తగదని తన మనసులోని మాటను తెలిపారు.
