Sunday, May 12, 2024
- Advertisement -

ట్రైలర్ టాక్ : నేను శైలజ : కొత్త సంవత్సరం కొత్తగా వస్తాడా ?

- Advertisement -

“స్నేహం అనేది విశాఖపట్నం సముద్రం లాంటిది ప్రశాంతంగా ఉంటది.. ‘మరి లవ్వో’.. హుధూద్ లాంటిది” అంటూ ట్రైలర్ స్టార్టింగ్ లోనే పంచ్ తో మొదలెట్టేసాడు హీరో రామ్ , నేను శైలజా ట్రైలర్ విడుదల అయిన కొన్ని గంటల లోగానే మంచి రెస్పాన్స్ ని మూటగట్టుకుంది.

ముఖ్యంగా మూస ధోరణిలో వెళుతున్న రాం బయటకి వచ్చి డిఫరెంట్ కథతో కనిపించడం అందరికీ నచ్చేసిన విషయం. ఈ మధ్య కాలం లో అన్నీ తలనొప్పి సినిమాలతో విసిగిస్తున్న రాం ఇలా కొత్త పంథా లో వెళ్ళడం ఆశ్చర్యకరం అంటున్నారు విశ్లేషకులు కూడా.”ఐలవ్యూ.. బట్ ఐయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ”

అనే డైలాగ్ తో టీజర్ రాగా ఇప్పుడు ఒచ్చిన ట్రైలర్ అదరహో అనిపిస్తోంది.ట్రైలర్ లో కామెడీ పంచ్ లు బాగానే పేలాయి. ఫ్యామిలీ మూవీ అనే ఇండికేషన్ ఇచ్చారు. విజువల్స్ నుంచి దేవిశ్రీ మ్యూజిక్ వరకూ అన్నీ సూపర్బ్ గా ఉన్నాయి. ఎక్కడా హడావిడి లేకుండా..

స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీల్ కలిగించాడు డైరెక్టర్ కిషోర్. చూస్తుంటే.. ఈసారి కుర్రాడు సక్సెస్ కొట్టేట్టే ఉన్నాడు. న్యూ ఇయర్ కి కొత్త రామ్ ని చూడచ్చు అన్నమాట .

{youtube}i916BRRHoTg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -