Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబలి ఖర్చులు చెప్పిన మౌళి

- Advertisement -

బాహుబలి ది బిగినింగ్ కే ఆరొందల కోట్లు రాలిపడ్డాయి అంటే అది రాజమౌళి చలవ అని చిన్న పిల్లలకి కూడా తెలుసు. అంత భారీ సినిమా తీసి జనాల మనస్సులో ఒక సుస్థిర స్థానం సంపాదించుకునేలా చేసాడు అంటే అది రాజమౌళి కి మాత్రమే చెల్లింది. మొదటి పార్ట్ రికార్డులని బద్దలుకొట్టేలా సెకండ్ పార్ట్ ని సిద్ధం చేస్తున్నాడు.

మరి బాహుబలి కోసం జక్కన్న పెట్టించిన ఖర్చెంత ? అంత భారీ చిత్రానికి బోలెడు ఖర్చని చాలా రకాల న్యూస్ వచ్చాయి. మొదటి రెండు భాగాలకు కలిసి 250 కోట్లు అనుకున్నారని బాహుబలి ఫస్ట్ పార్ట్ కే 150 కోట్లి పైగా ఖర్చయిందని న్యూస్ వినిపించాయి. కానీ రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇరవై రెండు కోట్లు మాత్రమే గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టాము అని చెబుతున్నారు. గ్రాఫిక్స్ మీద పూర్తిగా బేస్ అయిన సినిమా ఇది. రెండేళ్ళకి పైగా షూటింగ్ జర్పుకుంది.

నిర్మాణం కోసం 15 కోట్లూ, రాజమౌళి కి ఇరవై కోట్లూ వెళ్ళాయి. ప్రభాస్ సుదీర్ఘ కాలం ఇచ్చిన కాల్ షీట్ లకి ఇరవై కోట్లు చేల్లిన్చారట. మిగిలిన తారాగణం మొత్తానికి కలిపి 10 కోట్ల  లోపే ముట్టచెప్పినట్లు  భోగట్టా. సినిమాటోగ్రఫీ సౌండ్ డిజైనర్ స్టంట్ కొరిగ్రాఫర్ మేకప్ ఇతర టెక్నికల్ టీంకు 5 కోట్ల వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది.  

కాస్టూమ్స్ ఇతర మెటీరియల్ కు 10 కోట్లు వెచ్చించినా ప్రీ-పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు 10 కోట్లు పబ్లిసిటీకి 2 కోట్ల బడ్జెట్ తో కలిపితే మొత్తం ఎంతవుతుందో తెలుసా? 107 కోట్లు మాత్రమే. మిగిలిన అరకోరా కలిపినా నూట ఇరవై కోట్లు దాటవు. సో ఈ సొమ్ముతోనే మొదటి భాగం ఐపోయింది. అదే బడ్జెట్ లో రెండవ భాగం లోని నలభై శాతం కూడా పూర్తి చేసేసారు.  ఇంకో 50 కోట్లలో పార్టు 2 చుట్టేసినా.. నిర్మాతలకు భారీ లాభాలే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -