టాలీవుడ్ సీనియన్‌ఖ హీరో వికర్టీ వెంకటేశ్ కూతురి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ పెళ్లి అతి కొద్ది సన్నిహితుల మధ్య జరిగింది. ఇరుకుటుంబాలకు చెందిన బంధువులను మాత్రమే పెళ్లికి పిలిచినట్లు ఉన్నారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరైయ్యాడు. వధూవరులు ఆశ్రిత, వినాయక్‌లతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది ఉపాసన. హీరో రానాతో దిగిన ఫోటోలను షేర్ చేసింది ఉపాసన. టాలీవుడ్ నుంచి వీరు మాత్రమే వెళ్లినట్లు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వీరి పెళ్లికి హాజరైయ్యారు. వెంకీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ సల్మాన్, దీంతో ఆయన్ని తన కూతురు పెళ్లికి పిలిచాడు వెంకీ. పెళ్లిని మాత్రం అతి కొద్దిమందినే పిలిచిన దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప‍్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనుందని తెలుస్తుంది. ఈ రిసెప‍్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు , బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్‌ను పిలిచే ఆలోచనలో ఉన్నారట దగ్గుబాటి ఫ్యామిలీ. సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప‍్షన్ ఇవ్వనుందని తెలుస్తోంది.
- Advertisement -
వెంకీ కూతురి పెళ్లిలో రామ్ చరణ్ దంపతులు హల్ చల్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -